

సూచీలు రెండు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్టపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. విదేశీ మదుపర్ల విక్రయాలూ ప్రభావం చూపాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 10 పైసలు నష్టపోయి 90.05 వద్ద స్థిరపడింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 0.61% తగ్గి 63.37 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, షాంఘై, జపాన్ సూచీలు లాభపడగా, హాంగ్‌సెంగ్ సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లు మిశ్రమ ధోరణిలో ట్రేడయ్యాయి. బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.7.12 లక్షల కోట్లు తగ్గి, రూ.464.19 లక్షల కోట్ల (5.15 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది.
సెన్సెక్స్ ఉదయం 85,624.84 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 85,712.37) ప్రతికూలంగా ప్రారంభమైంది. తదుపరి 85,722.97 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే విక్రయాల ఒత్తిడితో ఒక దశలో 84,875.59 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరకు 609.68 పాయింట్ల నష్టంతో 85,102.69 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 225.90 పాయింట్లు కోల్పోయి 25,960.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 26,178.70-25,892.25 పాయింట్ల మధ్య కదలాడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 26 నష్టపోయాయి. బీఈఎల్ 4.97%, ఎటర్నల్ 2.45%, ట్రెంట్ 2.35%, టాటా స్టీల్ 2.18%, బజాజ్ ఫైనాన్స్ 2.12%, అదానీ పోర్ట్స్ 1.94%, బజాజ్ ఫిన్ సర్వ్ 1.77%, పవర్ గ్రిడ్ 1.69%, ఎస్బీఐ 1.58%, టీఎంపీవీ 1.53%, ఏషియన్ పెయింట్స్ 1.39%, టైటన్ 1.29%, ఎన్టీపీసీ 1.22%, కోటక్ బ్యాంక్ 1.07%, హెచ్ఐయూఎల్ 1.05%, ఎల్ అండ్ టీ 1.05%, భారతీ ఎయిర్టెల్ 1.03% తగ్గాయి. టెక్ మహీంద్రా 1.40%, హెచ్‌సీఎల్ టెక్ 0.31% చొప్పున పెరిగాయి. రంగాల వారీ సూచీలకొస్తే సేవలు, స్థిరాస్తి, భారీ యంత్ర పరికరాలు, టెలికాం, పారిశ్రామిక, యుటిలిటీస్, లోహ, విద్యుత్ రంగాలు డీలాపడ్డాయి. బీఎస్ఈలో 843 షేర్లు సానుకూలంగా, 3,460 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. 182 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!