
సినిమాలు

ముంబైలో భారీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులపై జరిగిన కేసులో ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (ITAT) కీలక తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తి రూ.27.65 లక్షల క్రెడిట్ కార్డు బిల్లులో రూ.13.95 లక్షలు నగదు రూపంలో చెల్లించడంతో ఆదాయపు పన్ను శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై వివరణ కోరింది.
ఆ వ్యక్తి తన భార్య, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆర్థిక సహాయంగా ఈ డబ్బు ఉపయోగించానని తెలిపాడు. అయితే ఆదాయపు పన్ను అధికారులు ఆ వివరణను పూర్తిగా అంగీకరించలేదు. అనంతరం కేసు ITATకు వెళ్లగా, అక్కడ కొంత ఉపశమనం లభించింది. భార్య నుంచి వచ్చిన రూ.3 లక్షలు సరైనదిగా గుర్తించగా, రూ.4.7 లక్షలను మాత్రమే అనధికారిక ఆదాయంగా పరిగణించారు. మిగతా మొత్తంపై పాక్షిక ఊరట లభించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!