

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇటీవల వరుస ర్యాలీతో దూసుకెళ్లిన మార్కెట్లు.. తాజా ట్రేడింగ్‌లో రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. మరోవైపు ఫైనాన్షియల్, రియాల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు కొంత మద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం కూడా మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్ 31.61 పాయింట్లు లాభపడి 81,911.01 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.30 పాయింట్లు పెరిగి 25,299.35 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.04గా నమోదైంది.
సెన్సెక్స్ 30లో బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, బీఈఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎటర్నల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు హిందుస్థాన్ యునిలీవర్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91.85 డాలర్ల వద్ద కొనసాగగా.. బంగారం ఔన్స్ ధర 3,947.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వివిధ రంగాల్లో మిశ్రమ ధోరణులు కనిపించడంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!