
రాజకీయాలు

భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ సానుకూల అంచనాలను వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను గతంలో ప్రకటించిన 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న వేగం, స్థిరమైన పనితీరు, పెట్టుబడుల కార్యకలాపాల్లో మెరుగుదల ఈ అంచనాల పెంపునకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.
దేశంలో బలమైన వినియోగ డిమాండ్, విస్తరిస్తున్న తయారీ రంగం, పటిష్టమైన ఆర్థిక పునాదులు వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నాయని మూడీస్ వెల్లడించింది. అయితే ద్రవ్యోల్బణం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. ఈ అంశాలు భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!