

2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను విధానంలో కీలక మార్పులు ఉంటాయనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్రం అడుగులు వేయనుందని సమాచారం. అదే సమయంలో పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. బడ్జెట్‌పై సామాన్యులు, మధ్యతరగతి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలతో కలిపి రూ.12.75 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఉంది. పాత పన్ను విధానంలో ఈ పరిమితి రూ.5.50 లక్షలకే పరిమితం కాగా, సెక్షన్ 80C, 80D వంటి పలు మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంచుకుంటుండటంతో, అందులోనూ హోం లోన్ వడ్డీ, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి మినహాయింపులు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. టాక్స్ రిబేట్ పరిమితిని రూ.15 లక్షలు లేదా రూ.20 లక్షలకు పెంచాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!