

దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.98,073 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖాతాదారులు మరణించిన తర్వాత వారి నామినీలకు ఖాతాల గురించి సమాచారం లేకపోవడం, అలాగే ఖాతాదారుల చిరునామా, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ వివరాలు అసంపూర్ణంగా ఉండటం వంటి కారణాలతో డిపాజిట్లు క్లెయిమ్ కాకుండా మిగిలిపోతున్నాయని తెలిపింది.
క్లెయిమ్ చేయని ఖాతాలను గుర్తించి, అర్హులైన ఖాతాదారులు లేదా వారి వారసులకు నగదు అందేలా బ్యాంకులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రత్యేక శిబిరాల ద్వారా ఇప్పటివరకు రూ.7,320 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని డిపాజిట్లను సంబంధిత వారికి చెల్లించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాతాదారులు తమ వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడం, నామినీ వివరాలను నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!