

భారత్పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)పై చర్చలను దీపావళి తర్వాతకు వాయిదా వేయడంపై ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శించారు. ఈ అంశాన్ని 2047 దీపావళి వరకు వాయిదా వేస్తే సరిపోతుందని ఆయన సెటైర్ వేశారు. అప్పటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
యూపీఐ చెల్లింపులను స్వీకరించే వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేయాలా వద్దా అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. లావాదేవీలను ప్రాసెస్ చేసినందుకు చెల్లింపు సేవల సంస్థలకు వ్యాపారులు చెల్లించే రుసుమునే ఎండీఆర్ అంటారు. చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు యూపీఐ చెల్లింపులు విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, చెల్లింపు సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను ఎలా భరించాలనే ప్రశ్న ఇంకా పరిష్కారం కాలేదు. గ్రోవర్ వ్యాఖ్యలు ఈ అంశంపై నెలకొన్న అనిశ్చితిని మరోసారి తెరపైకి తెచ్చాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!