

దేశంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో భారీ సేల్కు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే తన సేల్ తేదీలను ప్రకటించగా, తాజాగా అమెజాన్ కూడా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డులు మరియు ఈఎంఐ లావాదేవీలపై వినియోగదారులకు 10 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్ లభించనుందని అమెజాన్ వెల్లడించింది. పూర్తి డీల్స్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, గేమింగ్ కన్సోల్స్, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషీన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలతో పాటు అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 17 నుంచి తన సేల్‌ను ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందుగానే ప్రత్యేక యాక్సెస్ ఇవ్వనుంది. దీంతో ఈ పండుగ సీజన్లో మరోసారి అమెజాన్–ఫ్లిప్‌కార్ట్ మధ్య భారీ పోటీ జరగనుందని స్పష్టంగా కనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!