
బిజినెస్

రిలయన్స్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తన నియంత్రణ దాఖలాల్లో వెల్లడించింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు తెలిపింది. జియో ప్లాట్‌ఫామ్స్ ప్రజా వాటాల విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
జియో టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పాలక మండలిలో ఆకాశ్ అంబానీ 2014 నుంచే సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2022లో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ వేగంగా అభివృద్ధి చెందింది. ఆయన నాయకత్వంలో జియో తక్కువ సమయంలోనే కోట్లాది వినియోగదారులను సంపాదించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో సంస్థ భారీ ఆదాయం, లాభాలను నమోదు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!