
గాసిప్స్

వ్యక్తిగత రుణ మార్కెట్లో డిజిటల్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) బ్యాంకులకు భారీ సవాల్‌గా మారాయి. నిముషాల్లోనే రుణాలు మంజూరు చేయగల సౌలభ్యం వీటి ప్రత్యేకత. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి, భారతదేశంలోని డిజిటల్ ఎన్బీఎఫ్సీలు మంజూరు చేసిన వ్యక్తిగత రుణాల మొత్తం ₹1.28 లక్షల కోట్లకు చేరుకుంది.
ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ (ఫేస్) ప్రకారం, ఈ మొత్తంలో ₹97,381 కోట్ల రుణాలను ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ (ఆరు నెలల) కాలంలో మంజూరు చేశాయి. చిన్న వ్యాపారులు మరియు తక్కువ ఆదాయ వర్గాల వారు ఈ డిజిటల్ సంస్థలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి ఆరు నెలల్లో 6.4 కోట్ల మంది ఈ సంస్థల నుండి రుణాలు తీసుకున్నారు. గత ఏడాది అదే కాలంతో పోల్చినప్పుడు, డిజిటల్ రుణాలు తీసుకున్నవారి సంఖ్య 50 లక్షలు పెరిగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!