

భారత్‌లో 5జీ సేవల వినియోగం వేగంగా పెరుగుతోంది. 2031 నాటికి దేశంలో 110 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉండనున్నారు. 2025 చివరి నాటికి 5జీ వినియోగదారుల సంఖ్య 43 కోట్లకు చేరి, మొత్తం మొబైల్ కనెక్షన్లలో 35 శాతం వాటా సాధించనుంది. 2031 నాటికి మొత్తం మొబైల్ కనెక్షన్లలో 81 శాతం వాటా 5జీదే కానుందని నివేదిక పేర్కొంది. మెరుగైన మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలు, విస్తృత నెట్‌వర్క్ కవరేజ్ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
ప్రతి స్మార్ట్‌ఫోన్‌పై మొబైల్ డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఒక్కో వినియోగదారు నెలకు సగటున 37 జీబీ డేటా వినియోగిస్తుండగా, 2031 నాటికి ఇది 70 జీబీకి పెరగనుంది. ప్రస్తుతం 46 శాతం వాటాతో నాలుగో తరం సాంకేతికత కొనసాగుతున్నప్పటికీ, దాని వినియోగదారుల సంఖ్య 2025లో 57 కోట్ల నుంచి 2031 నాటికి 16 కోట్లకు తగ్గనుంది. తక్కువ ధరలో పరికరాలు అందుబాటులోకి రావడం, విస్తృత నెట్‌వర్క్ సేవలు, స్థిర వైర్‌లెస్ యాక్సెస్ సేవలు 5జీ విస్తరణకు తోడ్పడుతున్నాయి.
అంతర్జాతీయంగా 2026 తొలి త్రైమాసికంలో 5జీ కనెక్షన్ల సంఖ్య 310 కోట్లను దాటింది. కేవలం ఒక త్రైమాసికంలోనే 16.2 కోట్ల కొత్త కనెక్షన్లు జతయ్యాయి. 2031 నాటికి ఈ సంఖ్య 640 కోట్లకు పైగా చేరనుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 390 టెలికాం సంస్థలు వాణిజ్య 5జీ సేవలు అందిస్తుండగా, 90కిపైగా సంస్థలు స్వతంత్ర 5జీ సేవలను ప్రవేశపెట్టాయి. మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో 5జీ వాటా 2025లో 48 శాతం నుంచి 2031 నాటికి 85 శాతానికి పెరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!