

గత ఐదేళ్లలో (2020–25) దేశీయ విద్యుత్ వాహన (ఈవీ) రంగంలో సుమారు రూ.2.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (ఐఈఈఎఫ్ఏ) తాజా నివేదిక వెల్లడించింది. అయితే 2030 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన మొత్తం రూ.12.50 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఇది కేవలం 18 శాతం మాత్రమేనని పేర్కొంది. అందువల్ల రాబోయే ఐదేళ్లలో ఈవీ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని నివేదిక అభిప్రాయపడింది.
2030 లక్ష్యాలను సాధించేందుకు మిగిలిన రూ.10.2 లక్షల కోట్లను సమీకరించాలంటే వ్యవస్థాగత ఫైనాన్సింగ్ సంస్కరణలు కీలకమని ఐఈఈఎఫ్ఏ నివేదిక సహ రచయిత శుభమ్ శ్రీవాస్తవ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో ఈవీల వాటాను 30 శాతానికి, వాణిజ్య వాహనాల్లో 70 శాతానికి, బస్సుల అమ్మకాల్లో 40 శాతానికి, ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాల విక్రయాల్లో 80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!