

ఓపెన్ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0కు భారత్ అత్యంత కీలక మార్కెట్లలో ఒకటిగా మారిందని సంస్థ వెల్లడించింది. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ప్రకారం, 2026 ఏప్రిల్‌లో ఈ మోడల్ విడుదలైనప్పటి నుంచి భారతీయులు ఒక బిలియన్కు పైగా AI చిత్రాలను రూపొందించారు. హిందీ, బెంగాలీ, చైనీస్, జపనీస్, కొరియన్ వంటి భాషల్లో గత మోడళ్లకు సమస్యలు ఉండేవని, ఇప్పుడు కొత్త మోడల్ బహుభాషా టెక్స్ట్‌ను మరింత ఖచ్చితంగా చూపగలుగుతోందని ఓపెన్ఏఐ పరిశోధకులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలు, సంస్కృతులను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఓపెన్ఏఐ ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో భారతీయ వీధులు, రిక్షాలు, జనసంచారం వంటి వాస్తవిక దృశ్యాలను సహజంగా రూపొందించగలుగుతోందని చెప్పారు. 2K నాణ్యత, మెరుగైన టెక్స్ట్ ప్లేస్మెంట్, AI వాటర్‌మార్క్‌లు, డీప్‌ఫేక్ నిరోధక భద్రతా ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. భారత్‌లో వైరల్ అవుతున్న అనేక AI ట్రెండ్లు యూజర్ల సృజనాత్మకత వల్లే వచ్చినవని కూడా తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!