
రాజకీయాలు

గూగుల్ ఇండియా విభాగంలో భారీగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన వార్తలను సంస్థ ఖండించింది. గూగుల్ క్లౌడ్ ఇండియాలో పనిచేస్తున్న దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించనున్నారని, ఉద్యోగులు 24 గంటల్లో స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని లేదంటే తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించిందని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో టెక్ రంగంలోని ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
ఈ ప్రచారంపై స్పందించిన గూగుల్.. భారత్‌లో భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపట్టడం లేదని స్పష్టం చేసింది. వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరిచే క్రమంలో చేపట్టిన పరిమిత స్థాయి సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా గత వారం సుమారు 30 మంది ఉద్యోగులను మాత్రమే తొలగించినట్లు తెలిపింది. భారీగా ఉద్యోగాల కోతలు, బలవంతపు రాజీనామాలపై వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!