
జనరల్

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు లభించింది. ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025 పరిధిలోకి భోగాపురం ఎయిర్‌పోర్టును చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ విమానాశ్రయం నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు మార్గం పూర్తిగా సుగమమైంది.
ఈ గుర్తింపుతో భోగాపురం విమానాశ్రయం దేశంలోని కేటగిరీ-1 అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానాన్ని దక్కించుకుంది. ఇకపై ఇమిగ్రేషన్, వీసా సేవలు, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సౌకర్యాలు ఈ విమానాశ్రయంలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు పర్యాటకం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కూడా కొత్త ఊతం లభించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!