

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన కంటెంట్ నియంత్రణ విధానాల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కంటెంట్ మోడరేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మాతృసంస్థ మెటా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. హానికరమైన పోస్టులు, అభ్యంతరకరమైన కంటెంట్ వ్యాప్తిని తగ్గించడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.
కొత్త విధానంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌లో మార్పులు చేయడంతో పాటు కంటెంట్‌ను గుర్తించి నియంత్రించే ఫిల్టర్లను మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పర్యవేక్షణ వ్యవస్థను మెరుగుపరచడంపై కూడా దృష్టి సారించనుంది. ఈ కొత్త అప్‌డేట్స్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, మార్పుల అమలు తేదీ, పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!