
టెక్నాలజీ

శాంసంగ్ ఇండియా మొబైల్ విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్ వ్యాపార విభాగాధిపతి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న రాజు ఆంటోనీ పుల్లన్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు 18 సంవత్సరాల పాటు శాంసంగ్‌లో పనిచేసిన ఆయన, గత నాలుగున్నరేళ్లుగా మొబైల్ విభాగాన్ని ముందుండి నడిపించారు. భారతదేశంలో గెలాక్సీ ఫోన్లను మరింత మంది వినియోగదారులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఇప్పుడు ఆయన స్థానంలో మొబైల్ విభాగంలోని ప్రొడక్ట్ మార్కెటింగ్, ఈ-కామర్స్ బాధ్యతలు చూస్తున్న ఆదిత్య బబ్బర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై శాంసంగ్ ఇండియా నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. భారత మొబైల్ మార్కెట్లో శాంసంగ్ ఇప్పటికీ అగ్రస్థానాల్లో కొనసాగుతుండగా, ఈ మార్పులు కంపెనీ భవిష్యత్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!