

దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.62,500 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఎంపీఎంఎస్)ను అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించిన మొబైల్ ఫోన్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు ఈ పథకం ప్రయోజనాలకు అర్హత పొందనున్నాయి.
ఈ పథకం ద్వారా వచ్చే 10-14 నెలల్లో పూర్తిగా దేశీయంగా డిజైన్ చేసిన, మేధో సంపత్తి హక్కులు కలిగిన భారతీయ బ్రాండ్ మొబైళ్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఇతర కంపెనీల డిజైన్లను కాపీ చేసే సంస్థలకు పథకం ప్రయోజనాలు అందించబోమని ఆయన స్పష్టం చేశారు. పథకం కోసం దరఖాస్తు చేసే భారతీయ కంపెనీలు తమ మొబైల్ డిజైన్లకు మేధో సంపత్తి హక్కులు ఉన్నాయని నిరూపించాల్సి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!