

ఏఐ సంస్థ Anthropic తన చాట్బాట్లో ఇప్పటివరకు చెల్లింపు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న కొన్ని ప్రీమియం ఫీచర్లను ఇప్పుడు ఉచిత వినియోగదారులకు కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రీ ప్లాన్‌లో ఉన్నవారు ఇకపై ఫైల్ క్రియేషన్, స్కిల్స్, కనెక్టర్స్, కంపాక్షన్ వంటి నాలుగు కొత్త సదుపాయాలను ఉపయోగించుకోగలరు.
ఫైల్ క్రియేషన్ ద్వారా వినియోగదారులు చాట్‌లోనే స్ప్రెడ్షీట్లు, డాక్యుమెంట్లు, కోడ్ ఫైళ్లను రూపొందించి CSV, PDF వంటి ఫార్మాట్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కనెక్టర్స్ సాయంతో గూగుల్ డ్రైవ్, నోషన్, స్లాక్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లతో అనుసంధానం చేసుకుని డేటాను పొందడం, కొన్ని పనులను నేరుగా నిర్వహించడం సాధ్యమవుతుంది.
స్కిల్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులు ముందుగా నిర్వచించిన సూచనలను మళ్లీ మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా చాట్‌బాట్‌ను నిర్దిష్ట విధంగా పనిచేయించే అవకాశం లభిస్తుంది. కంపాక్షన్ టూల్ దీర్ఘ సంభాషణలను సంక్షిప్తంగా చూపించి వినియోగదారులు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి సులభంగా కొనసాగించేందుకు సహాయపడుతుంది. ఇదే సమయంలో OpenAI చాట్‌జీపీటీలో ప్రకటనలపై ప్రయోగాలు చేస్తుండటం గమనార్హం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!