

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష అంకుర సంస్థలు అంతరిక్ష రంగంలో సరికొత్త విజయాలను సాధిస్తున్నాయి. దేశీయ ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రయోగించిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్లో ఉపయోగించిన శాటిలైట్ బ్యాటరీ ‘పవర్‌బ్యాంక్-50’ను టేక్‌మీ2స్పేస్ సంస్థ రూపొందించింది. ఈ బ్యాటరీ అంతరిక్షంలో విజయవంతంగా పనిచేస్తూ ‘స్పేస్ ప్రూవెన్’ బ్యాటరీ ప్యాక్‌గా గుర్తింపు పొందిందని సంస్థ వెల్లడించింది.
భూమి నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో కాస్మోసర్వ్ స్పేస్ ప్రయోగాత్మక పేలోడ్‌కు పవర్‌బ్యాంక్-50 నిరంతర విద్యుత్ సరఫరా చేసింది. ప్రయోగ సమయంలో ఏర్పడిన తీవ్ర కంపనలు, అంతరిక్షంలోని రేడియేషన్, శూన్య వాతావరణం, అత్యంత శీతల–అధిక ఉష్ణోగ్రత పరిస్థితులను తట్టుకుని ఈ బ్యాటరీ సమర్థంగా పనిచేసిందని సంస్థ తెలిపింది. అధిక సాంద్రత కలిగిన లిథియం అయాన్ సెల్స్‌తో రూపొందించిన ఈ బ్యాటరీ 50 వాట్ అవర్‌కు పైగా శక్తిని నిల్వ చేస్తుంది. కేవలం 380 గ్రాముల బరువున్న ఈ బ్యాటరీ చిన్న ఉపగ్రహాలకు అనువుగా ఉండటంతో పాటు లో ఎర్త్ ఆర్బిట్‌లో ఐదేళ్ల వరకు పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!