

యాపిల్ మరోసారి తన మాక్ ల్యాప్‌టాప్‌ల లైనప్‌లో సంచలనం రాబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం, M5 చిప్‌తో కూడిన కొత్త మాక్‌బుక్ ప్రో త్వరలోనే రానుందనేది స్పష్టం.యాపిల్ ప్రపంచ మార్కెటింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్వియాక్ X (మునుపటి ట్విట్టర్)లో చిన్న టీజర్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో కనిపించే V ఆకారం రోమన్ అంకెలలో 5కి సంకేతం కావడంతో ఇది M5 చిప్‌కు సూచనగా భావిస్తున్నారు. అదనంగా, వీడియోలో కనిపించిన బ్లూ కలర్ వెర్షన్ కొత్త ఆకర్షణగా నిలుస్తోంది.పోస్ట్ క్యాప్షన్లోని “Mmmmm… something powerful is coming” అనే లైన్ కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఇందులోని ఐదు “M” అక్షరాలు కూడా M5 చిప్కే సంకేతమని భావిస్తున్నారు.
టెక్ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ కూడా ఈ టీజర్‌ను రీట్వీట్ చేస్తూ “M5 MacBook Pro” అని మాత్రమే రాసి మరింత ఊహాగానాలకు తెరతీశారు.
సమాచారం ప్రకారం, యాపిల్ ప్రస్తుతం J714 మరియు J716 అనే రెండు కొత్త మాక్‌బుక్ ప్రో మోడల్స్‌పై పని చేస్తోంది. ఇవి రెండూ M5 చిప్సెట్తో రానున్నాయి. తాజా లీకుల ప్రకారం, M4తో పోలిస్తే CPU పనితీరు 12% వేగంగా, GPU పనితీరు 36% మెరుగ్గా ఉండనుంది.అక్టోబర్ నెలలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించే అవకాశం తక్కువగా ఉన్నా, యాపిల్ ఈ కొత్త మాక్‌బుక్ ప్రోను మరికొన్ని కొత్త డివైస్లతో పాటు ప్రకటించే అవకాశముంది.






.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!