

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్లో భాగంగా గురువారం జరిగిన 14వ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో యూపీ వారియర్స్పై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో విజయం సాధించిన గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (38) మంచి ఆరంభం అందించగా, సోఫీ డివైన్ 42 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ బ్యాటర్లు పూర్తిగా తడబడి 17.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయ్యారు. రాజేశ్వరి గైక్వాడ్ 16 పరుగులకే మూడు కీలక వికెట్లు తీసి విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో మెరిసిన సోఫీ డివైన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో గుజరాత్ జెయింట్స్ మూడు వరుస ఓటముల పరంపరకు బ్రేక్ వేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!