

మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన హాంకాంగ్‌ను 137 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. స్మృతి మంధాన 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగుల సూపర్ సెంచరీ సాధించింది. షెఫాలి వర్మతో కలిసి తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించింది. షెఫాలి ఔటైన తర్వాత మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా.. స్మృతి ఒంటరి పోరాటంతో భారత్‌ను భారీ స్కోరుకు చేర్చింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ భారత బౌలర్ల ధాటికి 16.2 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ 3/9తో విజృంభించగా, నందని శర్మ, ప్రేమ రావత్, శ్రీచరణి రెండేసి వికెట్లు తీశారు. హాంకాంగ్ చివరి 9 వికెట్లను కేవలం 27 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో శతకంతో స్మృతి మంధాన రెండు అరుదైన రికార్డులు సాధించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 10,880 పరుగులతో మిథాలీ రాజ్‌ను అధిగమించి అత్యధిక పరుగుల వీరురాలిగా నిలిచింది. అలాగే 18 అంతర్జాతీయ శతకాలతో మహిళల క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. భారత్ శనివారం తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!