

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్‌ను తక్షణమే పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. గోవాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ20 పెట్రోల్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దిగుమతుల బిల్లును నియంత్రించేందుకు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు.
2003కు ముందు తయారైన కొన్ని వాహనాల్లో ఈ20 పెట్రోల్ వినియోగం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే, ఈ20 వల్ల వాహనాలు మొరాయిస్తున్నాయని, ప్రభుత్వం బ్లెండెడ్ ఇంధన విక్రయాలను నిలిపివేసిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఒక ఆటోమొబైల్ కంపెనీ ఇంజిన్లు దెబ్బతింటున్నాయంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు వేసినట్లు తెలిపారు. ఈ20 వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.1.60 లక్షల కోట్లు ఆదా కాగా, రైతులకు రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!