

భారత్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 52 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో అజేయంగా 89 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ఫిన్ అలెన్ 25 బంతుల్లో ఐదు సిక్సర్లతో 40 పరుగులు చేయగా, బెవాన్ జాకబ్స్ 23 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 39 పరుగులు సాధించాడు. గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు జోడించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే షాకిచ్చాడు. రెండో ఓవర్లో టీమ్ సీఫెర్ట్‌ను రెండు పరుగులకే ఔట్ చేశాడు. అనంతరం ఫిన్ అలెన్, డారిల్ మిచెల్ దూకుడుగా ఆడి పవర్‌ప్లే ముగిసే సమయానికి జట్టు స్కోరును 58/1కు చేర్చారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించగా, నితీష్ కుమార్ రెడ్డి అలెన్‌ను ఔట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ గ్లెన్ ఫిలిప్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. మిచెల్, జాకబ్స్ చివరి వరకు దూకుడుగా ఆడినప్పటికీ, ఆఖరి ఓవర్లో ప్రిన్స్ యాదవ్ కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీశారు. దీంతో భారత్ ముందు 199 పరుగుల లక్ష్యం నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!