27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అర్నబ్‌ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Writer: Chandrika 02:47 PM, 27 అక్టోబర్, 2026
అర్నబ్‌ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..

అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్నబ్‌ తుపాను ప్రభావం, ప్రభుత్వ ముందస్తు సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రస్తుత పరిస్థితి, వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు, తుపాను ప్రభావంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ సమీపంలోని యానాం నుంచి సుమారు 167 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గత ఆరు గంటలుగా గంటకు సుమారు 23 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతున్నట్లు తెలిపారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అవసరమైన చోట్ల సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సహా అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

తుపాను ప్రభావంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగులు కూలి రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సిద్ధంగా ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలను సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

అర్నబ్ తుపాను నేపథ్యంలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక విజ్ఞప్తి

అర్నబ్ తుపాను నేపథ్యంలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక విజ్ఞప్తి

అర్నబ్‌ తుఫాను ప్రభావం.. విశాఖలో ఈదురు గాలులు, నేలకొరిగిన చెట్లు

అర్నబ్‌ తుఫాను ప్రభావం.. విశాఖలో ఈదురు గాలులు, నేలకొరిగిన చెట్లు

మచిలీపట్నంలో తుఫాను అలర్ట్..

మచిలీపట్నంలో తుఫాను అలర్ట్..

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుక?

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుక?

ఏఐ, డీప్‌టెక్‌ స్టార్టప్‌ల కోసం రూ.700 కోట్ల ఫండ్‌..

ఏఐ, డీప్‌టెక్‌ స్టార్టప్‌ల కోసం రూ.700 కోట్ల ఫండ్‌..

ట్యాగ్లు
అర్నబ్‌ తుపానుచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్‌అమరావతితుపాను సన్నద్ధతభారీ వర్షాలుఎన్‌డీఆర్‌ఎఫ్‌ఎస్‌డీఆర్‌ఎఫ్‌జిల్లా కలెక్టర్లువిపత్తు నిర్వహణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది
జనరల్

కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది

యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ‘బేపర్వా’ ఫస్ట్ లుక్ విడుదల!
సినిమాలు

యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ‘బేపర్వా’ ఫస్ట్ లుక్ విడుదల!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
జనరల్

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర పెంపు
బిజినెస్

వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర పెంపు

 అక్కడ ‘బాహుబలి 2’ రికార్డు సమం చేసిన ‘జైలర్ 2’..
సినిమాలు

అక్కడ ‘బాహుబలి 2’ రికార్డు సమం చేసిన ‘జైలర్ 2’..

బిగ్‌బాస్‌ తెలుగు 10: 8వ వారం నామినేషన్లలో ముకేష్‌ రచ్చ.. శివ్‌, దేబ్జానీతో వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: 8వ వారం నామినేషన్లలో ముకేష్‌ రచ్చ.. శివ్‌, దేబ్జానీతో వాగ్వాదం

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..
రాజకీయాలు

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
రాజకీయాలు

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
జనరల్

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయల్ టాటా సవాలు
బిజినెస్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయల్ టాటా సవాలు

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!