

అస్సాంలోని కామ్రూప్ జిల్లా బమునిగావ్లో ఓ మహిళ రోడ్డుపై వెళ్తున్న కారును అడ్డుకుని, దానిపైకి ఎక్కి అద్దాలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గోల్పారా వైపు వెళ్తున్న హ్యుందాయ్ కారు (నంబర్ AS 01 DX 5856) అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారులో ఉన్నవారికి, మహిళకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆమె కారుపైకి ఎక్కి అద్దాలను పగులగొట్టినట్లు సమాచారం. మహిళను కారులోని వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్తున్నారనే అనుమానంతో స్థానికులు వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బోకో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కారులో ఉన్న ఫరీదుల్ ఇస్లాం, అమిదుల్, అబ్బాస్ అలీ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మహిళతో పాటు తంగ్ఖా హావో, చాట్మిన్ ఖాంగ్ అనే మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసినట్లు కథనం పేర్కొంది. వీరిలో కొందరు గతంలో ఓ భారీ డ్రగ్స్ కేసులో అరెస్టయి, బెయిల్పై విడుదలైనట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన డబ్బుల పంపకాల్లో తలెత్తిన వివాదమే ఘర్షణకు కారణమై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, నెట్వర్క్ వివరాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!