
రాజకీయాలు

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో గువాహటిలో జరిగిన రెండో వన్డేలో స్వదేశంలో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఒకే దేశంలో వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ 147 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ 132 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ 126 సిక్సర్లతో నాలుగో స్థానంలో, ఎంఎస్ ధోని 123 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!