

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత్ విజయాన్ని నమోదు చేసిన తర్వాత విరాట్ కోహ్లి మరియు యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ కలిసి చేసిన సరదా రీల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో కేవలం ఒకే రోజులో 10 కోట్లకు పైగా వీక్షణలను సాధించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
మొదటి రెండు వన్డేల్లో శతకాలు బాదిన కోహ్లికి, మూడో మ్యాచ్లో పెద్ద స్కోరు చేసే అవకాశం రాలేదు. అతను క్రీజ్కి వచ్చేసరికి జట్టుకు అవసరమైన పరుగులు కేవలం 116 మాత్రమే ఉండటంతో, సాధ్యమైనంత వేగంగా ఆడుతూ 45 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
ఈ నేపథ్యంలో అర్ష్దీప్ సరదాగా, లక్ష్యం చిన్నదిగా ఉండటం వల్లే సెంచరీ మిస్సయ్యావు కదా? అని కోహ్లిని ఆటపట్టించాడు. వెంటనే విరాట్ కూడా నవ్వుతూ, టాస్ గెలిచాం కాబట్టి అంతా బాగుంది. లేకపోతే ఈ మంచులో నువ్వే శతకం కొట్టేవాడివి అని జవాబిచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన ఈ నవ్వులమయ ముచ్చట్లతో కూడిన రీల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అర్ష్దీప్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగానే, అది క్షణాల్లో వైరల్ అవుతూ రికార్డు స్థాయి వీక్షణలు సాధిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!