
రాజకీయాలు

ఈ నెల 14న ఉప్పల్‌లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై గందరగోళం నెలకొంది. టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అభిమానులకు వెబ్‌సైట్‌లో సోల్డ్ అవుట్ అని కనిపిస్తుండటంతో అయోమయం ఏర్పడింది. ఇంకా టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఇప్పటివరకు సుమారు 12 వేల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చెబుతున్నట్లు సమాచారం. వెబ్‌సైట్‌లో కనిపిస్తున్న సమాచారం, టికెట్ల విక్రయాలపై హెచ్‌సీఏ చెబుతున్న వివరాల మధ్య వ్యత్యాసం అభిమానుల్లో సందేహాలను పెంచుతోంది. జిల్లా యాప్ ద్వారా టికెట్ల విక్రయాలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టికెట్ల లభ్యతపై నిర్వాహకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!