

హైదరాబాద్‌లో నల్లగొండ ఎక్స్ రోడ్ నుంచి సంతోష్‌నగర్ ఓవైసీ జంక్షన్ వరకు రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో సంతోష్‌నగర్, డీఆర్‌డీఓ మార్గాల్లో ప్రయాణించే పాతబస్తీ ప్రజలకు దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేసినప్పటికీ, నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. తాము పలుమార్లు బడ్జెట్ కేటాయింపులు కోరినా స్పందన రాలేదని, అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.620 కోట్ల నిధులు కేటాయించి పనులను వేగంగా పూర్తి చేయించారని ఆయన ప్రశంసించారు.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నూమా వరకు మెట్రో విస్తరణ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి అవుతుందనే విశ్వాసాన్ని ఓవైసీ వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ఫలక్‌నూమా ప్రజలకు ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకుంటారని, ఒకరోజు ఇద్దరం కలిసి మెట్రోలో ఫలక్‌నూమాకు ప్రయాణిస్తామని ఆయన గతంలో చెప్పిన మాటను గుర్తుచేశారు. సభలో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీకి కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్, తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంటూ, అభివృద్ధిలో తెలంగాణను దేశంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!