

భారత యువ షూటర్ సురుచి సింగ్ ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సురుచి 245.1 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది నాలుగు స్వర్ణాలు గెలుచుకున్న ఆమె, వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అదే దూకుడు చూపించింది. క్వాలిఫయింగ్ రౌండ్లో 586 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన సురుచి, ఫైనల్లో మాత్రం ఏ ప్రత్యర్థికీ ఛాన్స్ ఇవ్వలేదు. సంయమ్ సింగ్ 243.3 స్కోర్‌తో రజత పతకాన్ని గెలుచుకోగా, మను బాకర్ ఐదో స్థానంలో నిలిచింది.
సురుచి ఈ విజయంతో మను బాకర్ పేరిట ఉన్న జూనియర్ వరల్డ్ రికార్డును (244.7) కూడా తిరగరాసింది. మరోవైపు పురుషుల విభాగంలో సమ్రాట్ 221.5 స్కోర్‌తో కాంస్యం గెలుచుకున్నాడు. చైనాకు చెందిన హు కై స్వర్ణం, జర్మనీకి చెందిన క్రిస్టియన్ రీట్జ్ రజతం సాధించారు. అయితే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు నిరాశపరిచారు. రుద్రాంక్ష్ పాటిల్ నాల్గవ స్థానం, అర్జున్ బబుతా ఆరో స్థానం పొందగా, మహిళల్లో ఎలవెనిల్ వలరివన్ క్వాలిఫయింగ్ దశలోనే బయటకు వెళ్లింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!