

స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మంగళవారం ప్రారంభంకానుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగనున్నారు. తొలి రౌండ్లో శ్రీకాంత్ హాంకాంగ్‌కు చెందిన జేసన్ గనావన్తో తలపడనుండగా, ప్రణయ్ జపాన్‌కు చెందిన కొకి వటాంబేతో పోటీ పడనున్నాడు. మరో భారత ఆటగాడు తరుణ్ మన్నేపల్లి జపాన్ స్టార్ కెంటా నిషిమోటోను ఎదుర్కొననున్నాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ సింగపూర్‌కు చెందిన కీట్ వెస్లీ – కుబో జంటతో తొలి రౌండ్లో తలపడనుంది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి – ట్రీసా జంట, పురుషుల డబుల్స్‌లో అర్జున్ – హరిహరన్ జోడీ కూడా పోటీలో ఉన్నారు. అయితే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీ నుంచి వైదొలిగింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!