
క్రీడలు

కొలంబోలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో శ్రీలంక ఎలెవన్ బ్యాటర్లు భారత బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేశారు. ఓపెనర్లు రవీందు రసంత, నిషాన్ మదుష్క అద్భుతంగా ఆడి 71, 66 పరుగులు సాధించారు. అనంతరం కెప్టెన్ సోనల్ దినుష 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత్ తరఫున మొత్తం ఏడుగురు బౌలింగ్ చేయగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుథార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చివరి సెషన్‌లో భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసినప్పటికీ శ్రీలంక ఎలెవన్‌ను 350లోపే కట్టడి చేయలేకపోయారు. ఆట ముగిసే సమయానికి కేశర నువంత 9, దిలుమ్ సుదీర 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!