

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు కేవలం 16.1 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించారు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 46 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. క్వింటన్ డి కాక్ 47 పరుగులు చేయగా, ర్యాన్ రికెల్టన్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రొమారియో షెఫర్డ్ 52 పరుగులతో మెరిసగా, జేసన్ హోల్డర్ 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎన్గిడి 3 వికెట్లు సాధించగా, కగిసో రబడా, కార్బిన్ బోష్ తలో 2 వికెట్లు తీశారు. చేజ్ సమయంలో వెస్టిండీస్ తరఫున రోస్టన్ చేజ్ మాత్రమే వికెట్ సాధించాడు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!