

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం ఆయుష్ శెట్టి ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆరో ప్రపంచ చాంపియన్‌షిప్ పతకంపై కన్నేసిన సింధు రెండో రౌండ్లో కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌పై 21-16, 21-17తో విజయం సాధించింది. తదుపరి రౌండ్లో మూడో సీడ్ చైనా షట్లర్ వాంగ్ జి యితో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ షి యుకిని తొలి రౌండ్లో ఓడించిన ఆయుష్ శెట్టి.. రెండో రౌండ్లోనూ జోరు కొనసాగించాడు. శ్రీలంకకు చెందిన దుమిందు అబెవిక్రమపై 21-8, 21-10తో గెలిచి ప్రీక్వార్టర్స్ చేరాడు.
మరోవైపు 2021 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ రెండో రౌండ్లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో 21-19, 19-21, 17-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న ఉన్నతి హుడా కూడా కెనడా స్టార్ మిచెల్ లీ చేతిలో 21-11, 9-21, 21-23తో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి వాకోవర్‌తో ప్రీక్వార్టర్స్ చేరగా, అర్జున్–హరిహరన్ జోడీ ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీ 21-11, 21-11తో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!