
జనరల్

ఫిఫా వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్‌ను నిలువరించి కేప్ వెర్డె సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో అసలైన హీరోగా నిలిచింది 40 ఏళ్ల గోల్‌కీపర్ వోజిన్హా. పెడ్రీ, రోడ్రి, లామినే యమాల్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన స్పెయిన్ జట్టును తన అద్భుత గోల్‌కీపింగ్‌తో నిలువరించిన అతడు, ఏకంగా ఏడు కీలక సేవ్‌లు చేసి జట్టుకు చారిత్రాత్మక ఫలితాన్ని అందించాడు.
మ్యాచ్ అనంతరం వోజిన్హా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రదర్శనను చూసేందుకు తల్లి రాలేకపోవడం, తనను పెంచిన తాతయ్య, అమ్మమ్మ ఇక లేరనే బాధ అతడిని కలిచివేసింది. 2012లో జాతీయ జట్టులోకి వచ్చిన వోజిన్హా, 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి ఫిఫా వరల్డ్ కప్ ఆడుతూ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!