
ఓటీటీ

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రిస్ గేల్ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. అతడి సిక్సర్ల వర్షం, దూకుడైన ఆటతీరు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది.
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వైభవ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఒకవేళ ఐపీఎల్ వేలంలోకి వస్తే రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అతడి విధ్వంసకర ఆటకు ఆ మొత్తం కూడా తక్కువేనని అన్నాడు. మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!