
సినిమాలు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్-3 చైనా జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్‌తో భారత జంట తలపడింది.
మ్యాచ్ ఆరంభం నుంచే సాత్విక్–చిరాగ్ ఆశించిన స్థాయిలో ఆటను ప్రదర్శించలేకపోయారు. తొలి గేమ్‌ను 18–21తో కోల్పోయిన భారత జోడీ.. రెండో గేమ్‌లో మరింత వెనుకబడింది. చైనా జోడీ ఆధిపత్యం కొనసాగించడంతో 9–21తో రెండో గేమ్‌ను కూడా కోల్పోయారు. దీంతో కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసి, సాత్విక్–చిరాగ్ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!