

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు బాదిన ఈ 15 ఏళ్ల యువ సంచలనం మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి కొంతవరకు తన మైండ్‌లో ఉన్నప్పటికీ, కోచ్‌లు మాత్రం ప్రాక్టీస్‌లో చేసినదే మ్యాచ్‌లో అమలు చేయాలని, ఎలాంటి ప్రెజర్ తీసుకోకుండా ఆటను ఆస్వాదించాలని సూచించారని తెలిపాడు. తాను అదే విధానాన్ని అనుసరించి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశానని పేర్కొన్నాడు.
సెంచరీ మిస్ కావడంపై స్పందించిన వైభవ్, తాను వంద పరుగుల గురించి అసలు ఆలోచించలేదని స్పష్టం చేశాడు. అవుట్ అయిన బంతిని ఫీల్డర్‌ను చూసి ఆడానని, థర్డ్ మ్యాన్ మీదుగా ఆడితే బాగా కనెక్ట్ అయ్యేదని భావించానని చెప్పాడు. అయితే స్ట్రెయిట్‌గా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిస్‌టైమ్ అయి క్యాచ్ ఇచ్చానని వివరించాడు. తాను అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోరు 260 దాటుతుందని అనిపించిందని, అయినప్పటికీ 243 పరుగుల భారీ లక్ష్యాన్ని తమ బౌలర్లు కచ్చితంగా కాపాడగలరనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురెల్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ పరుగుల వరద పారించింది. పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 80 పరుగులు చేసిన RR, మధ్య ఓవర్లలో మరింత దూకుడు ప్రదర్శించింది. అయితే చివరి ఐదు ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు పుంజుకుని కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో అనేక చారిత్రాత్మక రికార్డులు నమోదయ్యాయి. రాజస్థాన్ చేసిన 243/8 స్కోరు ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరుగా నిలిచింది. అలాగే ఒక ప్లేఆఫ్స్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్ల రికార్డును 17 సిక్సర్లతో సమం చేసింది. ఇదే సమయంలో ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్‌కు ఇదే అత్యధిక స్కోరుగా నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎనిమిదోసారి 200కు పైగా స్కోరు సాధించి మరో అరుదైన ఘనతను అందుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!