

ఐపీఎల్ 2026లో వరుసగా మూడు ఓటములు చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తొలి నాలుగు మ్యాచుల్లో అద్భుత విజయాలు నమోదు చేసిన ఆ జట్టు, తర్వాత మాత్రం నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. చేతివరకూ వచ్చిన విజయాలను కూడా అందిపుచ్చుకోలేకపోతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలవడంతో జట్టుపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇదే సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్‌పై కోచ్ కుమార సంగక్కర అసహనం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్ జట్టు ప్రదర్శనపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ట్రోఫీ గెలవాలంటే ప్రస్తుతం ఆడుతున్న దానికంటే ఎంతో మెరుగ్గా రాణించాల్సి ఉంటుందని అన్నాడు. కనీసం 230 పరుగులు చేయాల్సిందని, ఫీల్డింగ్ కూడా చాలా దారుణంగా ఉందని పేర్కొన్నాడు. గత నాలుగైదు మ్యాచుల్లో తమ ప్రమాణాలకు తగ్గట్టుగా ఆడలేదని అంగీకరించిన పరాగ్.. ఇలాగే కొనసాగితే టాప్-4లో నిలిచే అర్హత కూడా తమకు లేదని వ్యాఖ్యానించాడు. మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజస్థాన్ పరిస్థితి క్లిష్టంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!