
ఆరోగ్యం

టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 ఖాళీలు ఉండగా, వాటిలో 2 స్టేట్ క్యాడర్, 5 మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు జూలై 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 17 దరఖాస్తులకు చివరి తేదీ. బీ.ప్లానింగ్ లేదా బీటెక్ (ప్లానింగ్) పూర్తి చేసి, 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు వేతనం లభిస్తుంది. అర్హులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!