

భారత క్రీడారంగంలో కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ కోచింగ్ ఎక్స్‌లెన్స్ (ఐఎస్‌సీఈ)ను ప్రారంభించారు. బహుముఖ కోచింగ్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా ప్రపంచస్థాయి కోచ్‌లను తయారు చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఫిజికల్ లిటరసీ, స్పోర్ట్స్ సైన్స్, క్రీడా విద్య, టెక్నాలజీ, కెరీర్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో శిక్షణ అందించనున్నారు.
కోచ్ మార్గదర్శకత్వం అథ్లెట్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడంలో కీలకమని నీరజ్ చోప్రా పేర్కొన్నారు. కోచ్‌లకు ప్రపంచస్థాయి జ్ఞానం, మెంటార్షిప్, ఆధునిక స్పోర్ట్స్ సైన్స్ పరిజ్ఞానం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ ఉత్తమ విధానాలను భారతీయ అనుభవంతో కలిపి కోచ్‌ల నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరిచే వేదికగా ఐఎస్సీఈను తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని గోపీచంద్ తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!