24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌కు నిరాశ..

Writer: Chandrika 12:12 PM, 24 నవంబర్, 2026
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌కు నిరాశ..

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువై చివరకు నిరాశతో సరిపెట్టుకుంది. ఇంకా 233 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టి భారత్ గెలుస్తుందని అభిమానులు ఆశించారు. అయితే రోజంతా కలిపి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసిన భారత బౌలర్లు విజయాన్ని అందించలేకపోయారు. మధ్యాహ్నం వరకు ఫర్వాలేదనిపించిన బౌలింగ్.. ఆ తర్వాత తేలిపోయింది. అయితే ఈ ఫలితాన్ని పూర్తిగా బౌలర్ల వైఫల్యంగా చూడలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిచ్‌లో వేగం, బౌన్స్ లేకపోవడంతో బౌలర్లకు పెద్దగా సహకారం లభించలేదు. తొలి ఇన్నింగ్స్‌లోనే టీమిండియా 720 పరుగులు చేయడం పిచ్ బ్యాటింగ్‌కు ఎంత అనుకూలంగా ఉందో స్పష్టం చేసింది.

మరోవైపు కూకాబుర్రా బంతి పరిస్థితి కూడా చర్చనీయాంశంగా మారింది. 25-30 ఓవర్లకే బంతి మెత్తబడిపోవడంతో సీమ్, స్వింగ్‌కు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఇరు జట్ల ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందిస్తూ.. కొవిడ్ మహమ్మారి ముగిసి చాలా సంవత్సరాలు గడిచినా బంతికి ఉమ్ము రాయడంపై నిషేధం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. బంతి త్వరగా మెత్తబడిపోతోందని, పిచ్‌లోనూ వేగం లేకపోవడంతో బౌలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నాడు. ఉమ్మును ఉపయోగించేందుకు అనుమతించాలని కోరాడు. ఇదిలా ఉంటే చివరి రోజు గిల్ కెప్టెన్సీ, ఫీల్డింగ్ వ్యూహాలపైనా విమర్శలు వచ్చాయి. వికెట్లు సాధించాల్సిన సమయంలో షార్ట్ లెగ్, రెండో స్లిప్ వంటి క్యాచింగ్ స్థానాల్లో ఫీల్డర్లను తొలగించడంపై విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తారు. లెగ్ సైడ్‌లో ఎక్కువగా ఆడే మిచెల్‌కు అనుగుణంగా ఫీల్డింగ్ ఏర్పాటు చేయలేదని అభిప్రాయపడ్డారు. ఆట ముగియడానికి మరో గంట సమయం ఉన్నప్పటికీ చివరి వరకు విజయం కోసం ప్రయత్నించకుండా ముందుగానే డ్రాకు అంగీకరించడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

ట్యాగ్లు
భారత్ వర్సెస్ న్యూజిలాండ్టీమిండియాశుభ్‌మన్ గిల్న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్తొలి టెస్ట్కూకాబుర్రా బంతిఉమ్ము నిషేధంభారత క్రికెట్ జట్టుటెస్ట్ క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ ఇంట్లోకి ఇమ్మాన్యుయేల్, సంజన ఎంట్రీ..
షోస్

బిగ్‌బాస్ ఇంట్లోకి ఇమ్మాన్యుయేల్, సంజన ఎంట్రీ..

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌కు నిరాశ..
క్రీడలు

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌కు నిరాశ..

మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి ఊరట లభించలేదు
జనరల్

మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి ఊరట లభించలేదు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..
క్రీడలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

2029లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు: అశోక్ గెహ్లాట్
రాజకీయాలు

2029లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు: అశోక్ గెహ్లాట్

మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారీ చిత్రాల నిరీక్షణ.. ఫలితం దక్కేనా?
సినిమాలు

భారీ చిత్రాల నిరీక్షణ.. ఫలితం దక్కేనా?

అనిల్ రావిపూడి విజయ రహస్యం ఇదేనా?
సినిమాలు

అనిల్ రావిపూడి విజయ రహస్యం ఇదేనా?

పరభాషల్లో స్టార్‌డమ్.. నటుల ప్రయాణం ఆసక్తికరం!
సినిమాలు

పరభాషల్లో స్టార్‌డమ్.. నటుల ప్రయాణం ఆసక్తికరం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!