

టీం ఇండియా యువ ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి ప్రదర్శన పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నితీశ్ జట్టులో స్థానం నిలబెట్టుకునే స్థాయికి చేరలేదని, అతను ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
అత్యంత కీలకమైన సమయంలో అక్షర్ పటేల్ ను పక్కన పెట్టి నితీశ్ ను ఎంపిక చేయడాన్ని శ్రీకాంత్ ప్రశ్నించాడు. స్వదేశీ పరిస్థితుల్లో నితీశ్ రికార్డులు సంతృప్తికరంగా లేవని, అలాంటి ఫార్మ్ తో వన్డే జట్టులో చోటు కల్పించడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు.
నితీశ్ రెడ్డి నిజంగానే ఆల్రౌండరా? అతని బౌలింగ్‌లో పేస్ ఉందా? మూవ్మెంట్ ఉందా? బ్యాటింగ్ లో డామినెన్స్ చూపాడా? అంతా ఒక సెంచరీతో ఆల్‌రౌండర్ అనిపించుకోలేడు అంటూ ఆయన విమర్శించాడు. నితీశ్‌ను ఆల్ రౌండర్ అంటారు అంటే, నాకు అయితే గ్రేట్ ఆల్‌రౌండర్ ట్యాగ్ ఇవ్వాల్సిందే! అని వ్యంగ్యంగా అన్నాడు.
హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే స్థాయి నితీశ్ కు లేదని, అక్షర్‌ను ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వలేదో స్పష్టత అవసరమని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
ఇంతకే ఆగకుండా గువాహటి టెస్ట్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో గౌతం గంభీర్ ను కూడా ఆయన నిలదీశాడు. ప్రతి రెండు మ్యాచుల్లో కొత్తవారిని ప్రయత్నించడం ట్రయల్ అండ్ ఎర్రర్ అని అనుకోవచ్చు. గంభీర్ కు తన అభిప్రాయం ఉండొచ్చు. కానీ నేను మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్. జట్టులో కన్సిస్టెన్సీ ఉండాలి అని స్పష్టం చేశాడు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!