
సినిమాలు

టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్న వివాదంలో చిక్కుకున్నారు. పంజాబ్ జట్టు ప్రయాణిస్తున్న విమానంలో చాహల్ ఈ-సిగరేట్ (వేప్) ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం ప్రయాణిస్తున్న సమయంలో జరిగిందని తెలుస్తోంది.
విమాన ప్రయాణంలో ఈ-సిగరేట్ వినియోగం నిషేధితమని, ఇది భద్రతా నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. వీడియోలో ఇతర ఆటగాళ్లు కూడా ఉన్నారని, పూర్తి ఫుటేజ్ ఎడిట్ చేసినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. బీసీసీఐ ఇప్పటికే ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉండటంతో, ఈ ఘటనపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తిగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!