
రాజకీయాలు

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపుకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ బెర్తులు అధికారికంగా ఖరారయ్యాయి. ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన కీలక విజయంతో చివరి ప్లే ఆఫ్స్ స్థానం రాజస్థాన్ ఖాతాలోకి వెళ్లింది. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఖరారైన షెడ్యూల్ ప్రకారం మే 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొనుంది. మే 27న ముల్లన్‌పూర్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ చివరి దశలో వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటపడటం అభిమానులను నిరాశకు గురిచేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!