

శ్రీలంక స్టార్ ఓపెనర్ పాథుమ్ నిశాంక తన అద్భుతమైన టైమింగ్‌తో జట్టుకు మంచి ఆరంభాలు అందించే ఆటగాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో అజేయ శతకం సాధించి మెప్పించాడు. మొత్తం 7 ఇన్నింగ్స్‌ల్లో 211 పరుగులు చేశాడు. రూ.4 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్‌కు చేరిన నిశాంక, ఈ సీజన్‌లో కీలక భాగస్వామ్యాలు అందిస్తాడని ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ (రూ.2 కోట్లు) కూడా డీసీ జట్టులో చేరి, టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్‌లో తన బ్యాటింగ్‌తో జట్టుకు బలం చేకూర్చనున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌పై 84 పరుగులతో రాణించిన అతడు ఐపీఎల్‌లో తన ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ జోర్డాన్ కాక్స్‌ను రూ.75 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అతడి భారీ షాట్లు జట్టుకు అదనపు బలం. జింబాబ్వే పేసర్ ముజరబాని కేకేఆర్ జట్టులో చేరి తన బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. ఆర్సీబీ జాకబ్ డఫీని (రూ.2 కోట్లు) తీసుకుని తమ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసింది. పంజాబ్ కింగ్స్ బెన్ డ్వార్షుయిస్ (రూ.4.4 కోట్లు), కూపర్ కనోలీ (రూ.3 కోట్లు)లను జట్టులోకి తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రైడెన్ కార్స్‌ను కొనసాగిస్తూ జాక్ ఎడ్వర్డ్స్‌ను చేర్చుకుంది. ఈ కొత్త ఆటగాళ్లతో జట్లు మరింత బలంగా మారనున్నాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!