

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 3-0తో కజకిస్థాన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత షట్లర్లు పి.వి. సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మ తమ సింగిల్స్ మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. తొలి సింగిల్స్‌లో పి.వి. సింధు 21-7, 21-9తో కామిలా స్మాగులోవాపై గెలిచింది. రెండో సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21-7, 21-10తో అలెస్సా కులేషోవాను ఓడించి భారత్ ఆధిక్యాన్ని 2-0కి పెంచింది.
మూడో సింగిల్స్‌లో తన్వి శర్మ 21-5, 21-10తో డయానా నమేనోవాపై విజయం సాధించి భారత్‌కు 3-0తో క్లీన్ స్వీప్ అందించింది. ఈ మూడు మ్యాచ్‌లను భారత షట్లర్లు మొత్తం 65 నిమిషాల్లోనే ముగించారు. దీంతో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్‌లో ఆతిథ్య జపాన్‌తో భారత్ తలపడనుంది. తొలి రౌండ్‌లో బై పొందిన జపాన్‌తో పోరు భారత జట్టుకు కీలకంగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!