

లడ్డూ వేలంపాటతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బాలాపూర్ మహాగణపతిని పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచందర్ రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత, ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మహేశ్వరం బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు, బీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సినీ నటుడు విజయ్ దేవరకొండ తదితరులు బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా బాలాపూర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి ప్రముఖులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. బాలాపూర్ మహాగణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రముఖులు తెలిపారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బాలాపూర్ గణేశుడి ఉత్సవాలు ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!